www.teluguminikavithalu.blogspot.com

Sunday, June 29, 2014

నీవే నా ఊపిరి...


నిన్ను చూసిన సమయాన నిదుర లేదులే నా హృదయాన....!

కనులు తెరచి కలలను కంటు... కధను మరిచి యధ నిన్నే చూస్తుంది...

      ఆ క్షణం నుంచి నిన్ను తలుచుకోని క్షణం లేదు...

      నీ పేరు పలుకని గడియలేదు...

      నీ రూపు ఉంహించని రోజు లేదు...

      నిన్ను మరచితే నా ఊపిరి లేదు...... 

నీవు చలించకు....


సముద్రం పొంగినది అని భూమి చలించదు...

భూమి కంపించినది అని ఆకాశం చలించదు...

ఆకాశం అదిరిపడుతుంది అని ప్రకృతి చలించదు...

ప్రకృతితో నిండిన ఈ లోకం నిన్ను చిన్న చూపు చూసిందని నీవు చలించకు.....

-- దయా

Friday, June 6, 2014

కవిత


కవిత అంటే మనసులో  ఉన్న భావానికి  కలం అందించే రూపం...

కవిత అంటే కళ్ళలో దాగి ఉన్న కలలను కరిగించే దీపం...

కవిత అంటే హృదయంలో ఉన్న గుర్తులను చూపించే దృశ్యం...

కవిత అంటే మనిషిలో ఉన్న మనసున నిలచే విశ్వం...

కవిత అంటే కదలకుండా ఉన్న హృదయాలను కరిగించే కమ్మని కావ్యం.... 

నీ రూపం సూర్యబింబం....


-- రాత్రికే రారాజు అయిన చంద్రునికి సైతం

          తన ప్రకాశానికి అడ్డంకులు ఎన్నో ఉన్నాయి...

-- కాని నీ రూపం సూర్యబింబంలా సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తుంటే,

          నీ ముందు నేను పట్టపగలు వెలిగిన విద్యుత్ దీపంలా వెలవెలబోతున్నా...!!!

Wednesday, June 4, 2014

నీవు లేని నేను లేను.....

ఎండ లేని రోజు ఉండవచ్చు

వాన రాని రోజు ఉండవచ్చు

ఆకు లేని చెట్టు ఉండవచ్చు

నీరు లేని చోటు ఉండవచ్చు

కాని నీవు లేని నేను లేను...

ప్రేమదాస్...


కాళిదాసుల కవితలు రాయలేకపోయినా....,

జేసుదాసుల పాటలు పాడలేకపోయినా...,

రామదాసు కంటే ఎక్కువగా నిన్ను ఆరాధించాను.... 

దేవదాసు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను....

మేనకవో... తారకవో...


దేవతవో రేవతివో నా మదిలో నిలిచిన మేనకవో... 

వెన్నెలవో వేకువవో నాలో అలజడి రేపిన తారకవో... 

గుండెల చాటున దాగిన ప్రేమను గేలం వేసి లాగావే... 

నిద్దుర పోయిన నా మదిలోన నాట్యం చేస్తూ నిలిచావే...