www.teluguminikavithalu.blogspot.com

Sunday, January 8, 2012

నే నీకై వేచియున్నాను...

విరిసిన మధు మల్లెల సాక్షిగా
కురిసిన సిరి వెన్నెల సాక్షిగా
తడిపిన చిరు జల్లుల సాక్షిగా         
మెరిసిన నీ చిరు నవ్వుల సాక్షిగా
                       నే నీకై వేచియున్నాను...

నీవుంటే.....

నీవుంటే ఆకాశమంత అనంతమైన ఆనందం నా సొంతం ...
నివెంటే నా పంచప్రాణాలు ప్రదక్షణం చేసెను ప్రతిక్షణం ...
ని కంటే అపురూపంగా నిన్ను ప్రేమించేది నా రూపం...
నీ వంటే  నిండుగా నాలో దాగివున్న అందమైన పండుగ....

తొలి పలుకు....

వర్షపు ధారలవంటి హర్షపు ధారలతో నను తడిపే
       తొలకరి తొలి చినుకా.... ఇదేనా తొలి పలుకు....
కలని అయిన కావాలనుకున్న కలకాలం నీ కనులలో కదలాడాలని....
నీటి బిందువునైన కాకపోతినే నిరంతరం నీ శరీరం పై  శ్వేదమై సేద తీర్చుకోవాలని....
చిరుగాలినైన అవ్వాలనుకున్న చిరునవ్వులు చిలికే నీ చెంపపై చిరకాలం చేరాలని...!!!!

స్నేహం,.................

స్నేహం,
        అది ఒక సుమమనోహర గంధం
          దానిని విడదిఅలేదు బృందం
          అదే మనిషి జీవితానికి అందం
           అది లేకపోతే జీవితమే అంధం(Blind)

నీవు లేని నేను లేను.....

ఎండ లేని రోజు ఉండవచ్చు
వాన రాని రోజు ఉండవచ్చు
ఆకు లేని చెట్టు ఉండవచ్చు
నీరు లేని చోటు ఉండవచ్చు
కాని నీవు లేని నేను లేను

ప్రేమని ఆపలేం

కదిలే కాలాన్ని ఆపలేం
పొంగే అలని ఆపలేం
వీచే గాలిని ఆపలేం
మదిలో ప్రేమని ఆపలేం

స్నేహం

తేనె కన్నా తియ్యనైనది స్నేహం
ప్రాణం కన్నా మిన్న అయినది స్నేహం
మరువలనుకున్న మరువలేనిది స్నేహం
తెంచాలనుకున్న తెంచాలేనిది స్నేహం
గాజు కన్న పదిలమైనది స్నేహం
ప్రేమ కన్న పదునైనది స్నేహం

Wednesday, January 4, 2012

నా ప్రేమనిలో.........


నింగి నుండి యెగసిన నీలి మేఘాల తోడుగా
 
ఉత్సాహంగా ఎగిరే గాలి పటాల నీడగా
 
నా ప్రేమనిలో పదిలంగా నిలిచి ఉండగా
 
ప్రేమకై నేను దిగులు చెందడం దండగ

నీ జాడకై....


కారు మబ్బుల చిమ్మ చీకట్లో కాంతి రేఖవై కనపడి 
మరుక్షణం మెరుపులా మాయమైన దివ్య రూపమా.... 

నీ జాడకై....  నీలి మేఘాలకి  Letter  రాశా...,
               అంతరిక్షయానానికి  Email  చేశా...,
               ఆకాశ పవనలకి  Phone  చేశా...,
               నక్షత్ర దీపాలకు  SMS  చేశా...,
      నీ మధుర రూపాన్ని మరోసారి విక్షించాలని.....

నింగికి ఎగసిన కెరటమా


నింగికి ఎగసిన కెరటమా..,

మబ్బు దాగిన చంద్రమా.., 

చెదిరిపోని చిత్రమా..,
 
వీడి పోనీ వరమా..,
 
ఎక్కడే నా ప్రాణమా.., ప్రియతమా.....!!!!!!!!!!

నూతన సంవత్సర శుభాకాంక్షలు


కష్టాల్లో కావ్యం లా...

బాధల్లో భాగ్యం లా...

దుఖంలో ధైర్యం గా...

సంతోషంలో సత్యం గా...

జీవితాంతం తోడుండే నేస్తం.....!

అందుకో నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.....!!