www.teluguminikavithalu.blogspot.com

Tuesday, May 13, 2014

నీ చిరునవ్వు.......


నిర్మలంగా వుండే ఆకాశం వడగండ్ల వానను కురిపిస్తుంది...

ప్రశాంతంగా వుండే సముద్రం తుఫానును సృష్టిస్తుంది...

శ్యామలంగా వుండే ప్రకృతి ఆపదలను కల్పిస్తుంది...

కానీ..,   అందంగా వుండే నీ రూపం చిరునవ్వు చిందిస్తుంది...

Monday, May 12, 2014

తల్లి ప్రేమ


లోకంలో ఆకాశం కంటే పెద్దదైనది 

             భూమి కంటే బరువైనది 


             సముద్రం కంటే లోతైనది 


             చంద్రుని కంటే తెల్లనైనది 


             సూర్యుని కంటే వెలుగైనది 


             మంచు కంటే చల్లనైనది... తల్లి ప్రేమ,


             దానిని మరువకు - మరచితే నీవు బ్రతుకకు...

Tuesday, May 6, 2014

నీ పరిచయం

వెన్నెల్లో వర్షం లా మరువలేనిది...

కంటిలో కనుపాప లా కలకాలం నిలిచేది...

చిరునవ్వు లా చిరకాలం చెదిరిపోనిది...

అమ్మ ఓడిలో మాటలలా మరుపురానిది...

                                                      నీ పరిచయం....